శ్రీ‌కృష్ణ యూత్ ఆధ్వ‌ర్యంలో మెగా మెడిక‌ల్ క్యాంప్

గ‌చ్చిబౌలి, సెప్టెంబ‌ర్ 29 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శ్రీ కృష్ణ యూత్ ఆధ్వర్యంలో గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గంలో ఏర్పాటు చేసిన మెగా మెడికల్ క్యాంప్ ను ఎమ్మెల్సీ ఎం.ప్రభాకర్ రావు, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్ ప్రారంభించారు. శ్రీ కృష్ణ యూత్ ఆధ్వర్యంలో అపోలో హాస్పిటల్స్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత మెగా మెడికల్ క్యాంపును ముఖ్యఅతిథిగా హాజ‌రై ప్రారంభించారు.

శిబిరాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్సీ ఎం.ప్రభాకర్ రావు, జగదీశ్వర్ గౌడ్

అనంతరం నిర్వాహకులను, వైద్యులను అభినందించారు. ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడమే తమ అంతిమ లక్ష్యం అని, శ్రీ కృష్ణ యూత్ సభ్యులు ఎప్పుడూ ఇలాంటి మరిన్ని సేవా కార్యక్రమాలతో ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ నర్సింగరావు, గచ్చిబౌలి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భరత్ గౌడ్, శ్రీ కృష్ణ యూత్ ప్రెసిడెంట్ అభిషేక్ గౌడ్, నియోజకవర్గ నాయకులు రాములు గౌడ్, కృష్ణ యాదవ్, శశాంక్ రావు, రోహిత్ గౌడ్, వివేక్ గౌడ్, కృష్ణ గౌడ్, సురేష్ గౌడ్, సత్యజిత్ గౌడ్, దేవేందర్ ముదిరాజ్, అరవింద్ గౌడ్, అనంత రామ్ గౌడ్, మహేష్ గౌడ్, సయ్యద్ చంద్ ,సుధీర్, కార్తిక్, సంగమేష్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

శిబిరంలో వైద్య ప‌రీక్ష‌లు చేయించుకుంటున్న జగదీశ్వర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here