మే 28 నుంచి మహిళల కోసం మెడికవర్ ఉచిత హెల్త్ ప్యాకేజీ – పోస్టర్ ను ఆవిష్కరించిన మెడికవర్ వైద్య బృందం

నమస్తే శేరిలింగంపల్లి: కోవిడ్‌పై వున్న భయంతో వ్యాధినిరోధక శక్తిని పెంచుకునేందుకు మెడికవర్ ఆస్పత్రి వైద్యులు తీవ్రంగా శ్రమిస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో మహిళలు జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంజలి అన్నారు. ఇంటర్నేషనల్ డే అఫ్ యాక్షన్ ఫర్ ఉమెన్స్ హెల్త్ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ వారిచే రూ. 3 వేల విలువ గల వైద్య పరీక్షలతో కూడిన ప్రత్యేక ఉచిత హెల్త్ ప్యాకేజీ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంజలి, మెడికవర్ ఉమన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్, గైనకాలజిస్ట్, ఒబెస్ట్ట్రీషన్ డాక్టర్ రాధిక, డాక్టర్ మీనాక్షి, రేడియాలజిస్ట్ డాక్టర్ హేమలత, సెంటర్ హెడ్ అనిల్ పాల్గొని మాట్లాడారు. ప్రజలకు చేరువయ్యేలా ఇలాంటి ప్రత్యేక ప్యాకేజీలు మరెన్నో అందించి ప్రజలకు మెరుగైన సేవలను అందించాలన్నారు. డాక్టర్ రాధిక మాట్లాడుతూ మహిళలు తమ ఆరోగ్యాన్ని చాలా నిర్లక్ష్యం చేస్తున్నారని, తగిన సమయంలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

రూ. 3 వేల విలువ చేసే వైద్య పరీక్షల ఉచిత హెల్త్ ప్యాకేజీ పోస్టర్ ను ఆవిష్కరిస్తున్న మెడికవర్ వైద్యులు

వివిధ రోగాల భారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అత్యవసర సమయాల్లో ఆరోగ్యకరమైన అంశాలపై సమన్వయం, వాతావరణంలో వచ్చే మార్పులను అధిగమించాలన్నారు. మన ఆరోగ్యం మన బాధ్యత అని, మన ఆరోగ్యాన్ని మనమే రక్షించుకోవాలన్నారు. మహిళలు వివిధ దశల్లో తమ ఆరోగ్యం పట్ల ఆలోచించించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి తెలిపారు. డాక్టర్ మీనాక్షి మాట్లాడుతూ రాబోయే తరాలకు అందమైన జీవితాన్ని అందించేందుకు ఆరోగ్యకరమైన, సంతోషకరమైన వాతావరణాన్ని కల్పించాలన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యమని, ఆరోగ్యవంతమైన సమాజంతోనే అభివృద్ధి సాధ్యమనే విషయాన్ని తెలియజేసే దిశగా కృషి చేస్తున్నామని అన్నారు. ఆరోగ్యంగా ఉండేలా మహిళలు తగిన వ్యాయామాలు చేస్తూ, పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా సెంటర్ హెడ్ అనిల్ మాట్లాడుతూ ఉచిత హెల్త్ చెక్ ప్యాకేజీ చేసే పరీక్షలు పూర్తిగా బ్లడ్ షుగర్, హిమోగ్లోబిన్, ఈఎస్అర్, రాండమ్ బ్లడ్ షుగర్, థైరాయిడ్ స్టిములేటింగ్ హార్మోన్, ఈసీజీ, యుఎస్ జి అబ్డోమెన్ పెల్విస్, పాప్ స్మెర్, గైనాకాలోజిస్ట్, జనరల్ ఫీజిషియన్, న్యూట్రిషన్ కన్సల్టేషన్ చేయనున్నట్లు వెల్లడించారు. మే 28 నుంచి జూన్ 4వ తేదీ వరకు మాత్రమే ఈ అవకాశం ఉంటుందని అన్నారు‌. ముందుగా అపాయింట్మెంట్ తీసుకోని రావాలని, అపాయింట్మెంట్ కోసం 040 – 68334455 ని సంప్రదించి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు‌. ఈ కార్యక్రమంలో ఆపరేషన్స్ హెడ్ సంగీత, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here