నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి మండలం పరిధిలోని గోపీ నగర్ లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ పర్యటించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం ప్రకటించిన 58 జీఓ కింద ఇళ్ల క్రమబద్దీకరణ కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలపై ఆరా తీశారు.
ప్రభుత్వ స్థలాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకుని 58 జీఓ కింద దరఖాస్తు చేసుకున్న పేదల ఇళ్లను కలెక్టర్ ఆమోయ్ కుమార్ పరిశీలించారు. అర్హులైన లబ్దిదారులకు ఇళ్లను క్రమబద్దీకరించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు. ఆయన వెంట జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇండస్ట్రీస్ అండ్ టీం జీఎం రాజేశ్వర్ రెడ్డి, డిప్యూటీ కలెక్టర్, శేరిలింగంపల్లి తహశీల్దార్ వంశీ మోహన్, ఉప తహశీల్దార్ శంకర్, సర్వేయర్ మహేష్, సీనియర్ అసిస్టెంట్ చంద్రారెడ్డి, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.