నమస్తే శేరిలింగంపల్లి: వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగపడుతాయని బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ అన్నారు. మియాపూర్ డివిజన్ లో ఆర్ కే వై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని రవి కుమార్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవికాలంలో ప్రయాణికులకు, పాదచారులకు చలివేంద్రాల ద్వారా ఉపశమనం లభిస్తుందన్నారు. ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఆర్ కే వై ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వర్ గౌడ్, రాధా కృష్ణ యాదవ్, మాణిక్ రావు, శ్రీధర్ గౌడ్, లక్ష్మణ్ ముదిరాజ్, సీతారామరాజు, గణేష్ ముదిరాజ్, సురేష్ ముదిరాజ్, తిరుపతి, శ్రీనివాస్, రాము, విజేందర్ తదితరులు పాల్గొన్నారు.