శేరిలింగంపల్లి, ఏప్రిల్ 28 (నమస్తే శేరిలింగంపల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని శంషీగూడ, శిల్పా బృందావన్, మహంకాళి నగర్, ఛత్రపతి శివాజీ నగర్ కాలనీల లో నెలకొన్న పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి PAC చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ కాలనీ లో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ కాలనీ లో వరద నీటి కాల్వ ,డ్రైనేజి వ్యవస్థ ను, మంచి నీటి వ్యవస్థ ను మెరుగుపరచాలని కోరారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు కాలనీ లో పాదయాత్ర చేయడం జరిగిందని, వరద నీటి కాల్వ ఔట్ లెట్ లో పేరుకుపోయిన చెత్త చెదారం తీసి నీటి ప్రవాహం సాఫీగా సాగేలా చూడాలని, ఓపెన్ నాలలో, వరద నీటి కాల్వ లో పూడికతీత పనులు త్వరితగతిన చేపట్టి రాబోయే వర్షాకాలం లోపు పనులు పూర్తి చేసి నీటి ప్రవాహం సాఫీగా సాగేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో GHMC అధికారులు AE శ్రావణి, వర్క్ ఇన్స్పెక్టర్ రవి, జలమండలి అధికారులు మేనేజర్ ఝాన్సీ, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, కాలనీ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.