నమస్తే శేరిలింగంపల్లి: మియపూర్ డివిజన్ పరిధిలోని ప్రతి బస్తి, కాలనీ అభివృద్ధికి కృషి చేస్తున్నామని మియపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని బాలాజీ నగర్ కాలనీ లో సుమారు రూ. 12 లక్షల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న మంచినీటి పైప్ లైన్ నిర్మాణ పనులను శుక్రవారం జలమండలి అధికారులు, స్థానిక నాయకులతో కలసి పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖమంత్రి కేటీఆర్, ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి శాసనసభ్యులు ఆరెకపూడి గాంధీ, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్ రంజిత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయని అన్నారు. డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉంటూ మౌళికవసతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు మేనేజర్ సాయి చరిత, వర్క్ ఇన్స్పెక్టర్ రమేష్, నాయకులు జహాంగీర్, నర్సింగ్ ముదిరాజ్, బాల్ రాజ్, మహమ్మద్ గౌస్, సల్మాన్, జితేందర్, కుమార్, నగేష్, ఛాన్ మియా, జాఫర్, తదితరులు పాల్గొన్నారు.