నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని జనప్రియ నగర్ -2 కాలనీలో కమ్యూనిటీ హాల్ లో జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వాక్సినేషన్ కార్యక్రమాన్ని శుక్రవారం మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ పరిశీలించారు. కరోన వ్యాధిని అరికట్టేందుకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, విధిగా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న కోవిడ్ వాక్సినేషన్ ను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నల్ల సంజీవ రెడీ, బాలింగ్ యాదగిరి గౌడ్, కృష్ణ ముదిరాజ్, ఎం.డి గౌస్, జనప్రియ నగర్-1 అధ్యక్షుడు శాంతయ్య, జనప్రియ నగర్-2 అధ్యక్షుడు జితేందర్ రెడ్డి, కిష్టన్న, అశోక్, కొండల్ రెడ్డి, వాసుదేవ రావు, రవి, విజయ్,మస్తాన్, హఫీజ్ పేట్ ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్ వినయ్ తదితరులు పాల్గొన్నారు.