ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పిస్తాం – మన ఊరు మన బడి పై ప్రభుత్వ విప్ గాంధీ సమీక్ష

నమస్తే శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా అన్ని రకాల మౌలిక వసతులను కల్పించడం జరుగుతుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో పరిధిలో నిర్వహించనున్న మన ఊరు మన బడి కార్యక్రమం పై మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో టీఎస్ ఈడబ్ల్యుఐడీసీ ఏఈ శ్యామ్, పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల వసతులను కల్పించేందుకు సీఎం కేసీఆర్ మన ఊరు మన బడి కార్యక్రమం చేపట్టారన్నారు. శేరిలింగంపల్లి మండలంలోని 24 ప్రభుత్వ పాఠశాలలకు రూ. 4.82 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. మరిన్ని అదనపు నిధుల మంజూరుకు హెచ్ఎంల నుంచి ప్రతిపాదనలు తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మంజూరయ్యేలా కృషి చేస్తామని చెప్పారు. నిధులను అభివృద్ధి పనులకు‌ వాడుకుని పనులను సకాలంలో‌ పూర్తి చేయాలని సూచించారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడాలని అన్నారు. పాఠశాలలో ముఖ్యంగా మేజర్ అండ్ మైనర్ రిపేర్లు కాంపౌండ్ వాల్, క్లాస్ రూమ్స్, టాయిలెట్స్, కిచెన్ షేడ్ వంటి పనుల నిర్మాణం, మరమ్మత్తులు, పెయింటింగ్, ఫర్నిచర్, చాక్ బోర్డ్, డిజిటల్ రూమ్స్, వంటి పనులు చేపట్టి కొత్త ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడమే ముఖ్య ఉద్దేశ్యం అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఎస్ ఈడబ్ల్యుఐడీసీ ఏఈ శ్యామ్, ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

మన ఊరు మన బడి కార్యక్రమంపై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here