నాయినమ్మ కుంటను పరిశీలించిన కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

నమస్తే శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చెరువులను సుందరీకరించి అభివృద్ధి చేస్తున్నామని మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని నాయినమ్మ కుంట చెరువు సుందరీకరణ, అభివృద్ధి పనులను స్థానికులతో కలసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ మియాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీ లక్ష్మి నగర్ కాలనీ వద్ద గల నాయనమ్మకుంట చెరువు అభివృద్ధి లో భాగంగా చెరువు సుందరీకరణ, సంరక్షణ, చెరువు అభివృద్ధి పనులు చేయడం జరుగుతుందన్నారు. చెరువు సుందరీకరణలో భాగంగా చెరువు కట్ట పటిష్టం పరిచేలా పునరుద్ధరణ, మురుగు నీరు చెరువులో కలవకుండా ప్రత్యేకంగా చెరువు చుట్టూ నిర్మించే మురుగు నీటి కాలువ నిర్మాణం, అలుగు మరమ్మత్తులు, చెరువు కట్ట బలోపేతం, పునరుద్దరణ పనులు, వాకింగ్ ట్రాక్ వంటి పనులను చేపట్టనున్నట్లు చెప్పారు. చెరువు చుట్టూ ఫెన్సిగ్ నిర్మాణం, చెరువు అలుగు నిర్మాణం, చెరువు సుందరీకరణ పనులు చేపడుతున్నామని చెప్పారు. ఆయన వెంట సంబంధిత అధికారులు తదితరులు ఉన్నారు.

నాయినమ్మ కుంటను పరిశీలిస్తున్న కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here