శేరిలింగంపల్లి, నవంబర్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): తెలుగు జర్నలిజానికి అత్యంత వన్నె తీసుకొచ్చిన మహోన్నత జర్నలిజం శిఖరం పద్మ విభూషణ్ రామోజీరావు అని పిఎసి చైర్మన్ ఆరెక పూడి గాంధీ అన్నారు. వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీ కమ్యూనిటీ హల్ లో జరిగిన పద్మ విభూషణ్ రామోజీరావు జయంతి సందర్భంగా ప్రజా ఆలోచన వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సంస్మరణ సభ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. సంస్మరణ సభ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రజా ఆలోచన వేదిక అధ్యక్షుడు విద్యా వెంకట్ మాట్లాడుతూ సమాజంలో సామాజిక స్పృహను పెంపొందించేందుకు అసమానతలను తొలగించేందుకు ప్రజా ఆలోచన వేదిక పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకుడు కంకణాల వెంకట సుబ్బయ్య, జనసేన నాయకుడు కొల్లా శంకర్, జర్నలిస్టులు సముద్రాల జగదీశ్వర్ గుప్తా, కళ్యాణ్, సముద్రాల కిరణ్ తదితరులు పాల్గొన్నారు.