నమస్తే శేరిలింగంపల్లి: డివిజన్ అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తానని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని మధురానగర్ లో ప్రజా సమస్యలపై బస్తీ బాట లో భాగంగా స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మధురానగర్ లో మంచి నీటి వ్యవస్థను ఏర్పాటు చేస్తామని, అందుకు నూతనంగా పైపు లైన్లను ఏర్పాటు చేయాలని వాటర్ వర్క్స్ అధికారులకు కార్పొరేటర్ సూచించారు. కాలనీలో డ్రైనేజీ, సీసీ రోడ్లను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ ఆర్ వెంకటేశ్వర్లు, మహిళా మోర్చా అధ్యక్షురాలు మహేశ్వరి, వాటర్ వర్క్స్ మేనేజర్ వెంకట్ రెడ్డి, వర్క్ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్, ఆపరేటర్ మల్లేష్, బీజేపీ నాయకురాలు వరలక్ష్మి, నర్సింగ్ నాయక్, శేఖర్, సునీత, రాణి, జనార్దన్, సాయి కుమార్, రాములు, రవి కుమార్, మమతా, పద్మ, బస్తి వాసులు పాల్గొన్నారు.
