నమస్తే శేరిలింగంపల్లి: ఓ కార్మికునికి చేతి మణికట్టు తెగిపోవడంతో శస్త్ర చికిత్స చేసి తిరిగి అమర్చి మరో మైలు రాయిని సాధించింది సిటిజన్స్ స్పెషాలిటీ ఆస్పత్రి. జంట నగరాల్లో అనుభవజ్ఞులైన ఆర్థోపెడిక్ సర్జన్లతో కూడిన ఉత్తమ బృందాలలో ఒకటైన డాక్టర్ అశోక్ రాజు గొట్టెముక్కల నేతృత్వంలోని డాక్టర్ వాసుదేవ జువ్వాడి, డాక్టర్ కిలారు ప్రఫుల్ బృందం తెగిపోయిన మణికట్టును శస్త్రచికిత్స చేసి అతికించారు. ఈ చికిత్సలో ప్లాస్టిక్ సర్జన్లు డాక్టర్ వెంకటేష్ బాబు, డాక్టర్ శశిధర్ రెడ్డితో పాటు నిపుణులైన అనస్థీషియాలజిస్టుల బృందం శస్త్రచికిత్స విజయవంతానికి తమవంతు సహకారాన్ని అందించారు. 22 ఏళ్ల యువకుడు హరీష్ సంగారెడ్డి సమీపంలోని నందిగామలోని ఓ పానీయాల ఫ్యాక్టరీలో మెషిన్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. కర్మాగారంలో యంత్రంతో పనిచేస్తున్నప్పుడు అతని కుడి మణికట్టు ప్రమాదవశాత్తు తెగిపోయింది.అతని సహోద్యోగులు తెగిపడిన అవయవాన్ని ప్లాస్టిక్ సంచిలో వేసి, ఐస్‌లో ప్యాక్ చేసి, అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని నల్లగండ్లలోని సిటిజన్స్ స్పెషాలిటీ ఆస్పత్రికి తీసుకువచ్చారు.

ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ చేరుకునే సరికి రక్తం పోవడం వల్ల కలిగిన షాక్‌లో ఉన్నాడు. అతని పరిస్థితి చక్కదిద్ది ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్‌లోకి తీసుకెళ్లారు. ఆర్థోపెడిక్స్ నుండి డాక్టర్ వాసుదేవ జువ్వాది, డాక్టర్ కిలారు ప్రఫుల్, ప్లాస్టిక్ సర్జరీ నుండి డాక్టర్ వెంకటేష్ బాబు, డాక్టర్ శశిధర్ రెడ్డి చేతిని తిరిగి అతికించేందుకు శస్త్రచికిత్స ప్రారంభించారు. లింబ్ సర్జరీ రీప్లాంటేషన్ ప్రక్రియ ఎనిమిది గంటల పాటు కొనసాగింది. శస్త్ర చికిత్స తర్వాత హరీష్‌కి ఎలాంటి ఇన్‌ఫెక్షన్ లేకుండా మంచి కండరాలను కలిగి ఉన్నట్లు వైద్యులు చెప్పారు. రీజినల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ ప్రభాకర్ పలచర్ల మాట్లాడుతూ, భారతదేశంలో ప్రమాదమైన తర్వాత మొదటి 60 నిమిషాలు గోల్డెన్ అవర్ గా పరిగణిస్తారన్నారు. అందువల్ల గాయం తీవ్రతను త్వరగా పరిశీలించడం అత్యవసరమని చెప్పారు. విస్తృతమైన శిక్షణ, అనుభవం అత్యాధునిక సాంకేతికతతో, సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ పాలీట్రామా కేసులను ఎదుర్కోవడానికి అత్యంత నైపుణ్యం కలిగిన ఆర్థోపెడిక్ నిపుణుల బృందాన్ని కలిగి ఉందన్నారు. సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ అత్యుత్తమ వైద్య నైపుణ్యాన్ని, సాంకేతికతను అందించడానికి కట్టుబడి ఉందని తెలిపారు. సిటిజన్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆర్థోపెడిక్స్ డిపార్ట్‌మెంట్ హెడ్ అండ్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ అశోక్ రాజు గొట్టెముక్కల ఈ విధానాన్ని వివరించారు. వివిధ యంత్రాలతో వృత్తిపరమైన సంబంధం గల యువకులు ఎక్కువగా చేతి గాయాలపాలవుతారని, చేయి తెగిపోవడం అత్యంత ఘోరమైన గాయాలలో ఒకటని, రీప్లాంటేషన్ విషయంలో రోగిని ఆరు గంటలలోపు ఆసుపత్రికి తరలించడం, అవయవాన్ని సంరక్షించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయన్నారు.

ఆర్థోపెడిక్స్ డిపార్ట్‌మెంట్ అంటే సిటిజన్స్ బోన్ అండ్ జాయింట్ ఎలాంటి పాలీట్రామా కేసులనైనా ఉత్తమ ఫలితాలతో నిర్వహించడానికి విస్తృతమైన నైపుణ్యాన్ని కలిగి ఉందని తెలిపారు. సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ పూర్తిస్థాయి ఎమర్జెన్సీ కేర్ రెస్పాన్సివ్ వ్యవస్థను కలిగి ఉందన్నారు. ఇది శిక్షణ పొందిన క్లినికల్ మ్యాన్‌పవర్, అత్యాధునిక సాంకేతికత అలాగే సాక్ష్యం ఆధారిత చికిత్సను నిర్వహిస్తుందని వివరించారు. ప్రతి వైద్యుడు మోకాలు, తుంటి జాయింట్ రీప్లేస్‌మెంట్, ఫ్రాక్చర్ ఫిక్సేషన్, విఫలమైన ఆర్థోపెడిక్ సర్జరీల కరెక్షన్, పెల్విక్, ఎసిటాబులమ్ సర్జరీలు, వైకల్య సవరణలు వంటి సబ్-స్పెషాలిటీ పద్ధతుల చికిత్స నిర్వహణలో ప్రత్యేకంగా శిక్షణ పొందారని తెలిపారు. స్పోర్ట్స్ మెడిసిన్, ఆర్థ్రోస్కోపీ, పీడియాట్రిక్ ఆర్థోపెడిక్స్ సిటిజన్ స్పెషాలిటీ హాస్పిటల్ రోగులకు అత్యంత అధునాతన చికిత్స అందించేందుకు సరికొత్త సాంకేతికతలతో కూడిన అసమానమైన మౌలిక సదుపాయాలు సిటిజన్ హాస్పిటల్ లో ఉన్నాయని తెలిపారు. 30 కంటే ఎక్కువ స్పెషాలిటీలు, సూపర్ స్పెషాలిటీల నిపుణులు సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ టీమ్‌లో ఉన్నారని వెల్లడించారు. సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ ఈ వన్ అత్యవసర సేవలను ప్రవేశపెట్టిందన్నారు. ఇవి లైఫ్‌సేవింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, అంతర్జాతీయంగా ఆమోదించిన ఎమర్జెన్సీ ప్రోటోకాల్స్, రోగికి అనుకూలంగా ఉండి తొందరగా కోలుకునేలా చేసే సంరక్షణను అందించడానికి అనేక రకాల ప్రత్యేక విభాగాలను కలిగి ఉన్నాయన్నారు.