నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ లోని శిల్పారామంలో నిర్వహిస్తున్న గుర్జారీ హస్తకళా హాత్ సందర్శకుల తాకిడితో శనివారం కిటకిటలాడింది. ఆదివారంతో ముగియనుండడంతో సందర్శకులు అధిక సంఖ్యలో హాజరై గుజరాత్ చేనేత హస్తకళా ఉత్పత్తులను కొనుగోలు చేశారు. పటోళ్ల చీరలు, అజరాక్ చీరలు, బందీని డ్రెస్ లు చీరలు, అద్దాలతో తయారు చేసిన లంగాలు, బ్లౌజ్ లు, బేడీషీట్లు , నైల్ పెయింటింగ్, డెకొరేటివ్ ఐటమ్స్, తదితర హస్తకళలు ఆకట్టుకుంటున్నాయి. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా డాక్టర్ మనోజ్ఞ శిష్య బృందం చే కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. వినాయక కౌతం, శివ శివ భావ భావ, ముద్దుగారేయ్ యశోద, కదన కుతూహలం తిల్లాన, బ్రహ్మాంజలి, దుర్గ స్తుతి, జయము జయము, మోహిని భస్మాసుర అంశాలను కళాకారులు ప్రదర్శించారు. సింధు, మనస్విని, ప్రణతి, భావన, శ్రేష్ఠ, గ్రీష్మ, వర్షిక, నక్షత్ర, గంగ తదితరులు ప్రదర్శించారు.