నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ డివిజన్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తామని మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ పేర్కొన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని మాదాపూర్ 100 ఫీట్ రోడ్డులో ఏర్పడిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యను, నూతనంగా మంజూరై చేపట్టిన సీసీ రోడ్డు పనులను స్థానికులతో కలిసి గురువారం స్థానిక కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తుందన్నారు. డివిజన్ పరిధిలో మంజూరైన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేలా అహర్నిశలు కృషి చేస్తామని చెప్పారు. మాదాపూర్ డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారం చూపుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈ ప్రశాంత్, వాటర్ వర్క్స్ మేనేజర్ లివర్తి, నాయకులు మొయిజ్, శ్రీధర్, అజీమ్, పాషా, ఇంజినీరింగ్ వర్క్ ఇన్‌స్పెక్టర్ లు తదితరులు పాల్గొన్నారు.
