నమస్తే శేరిలింగంపల్లి: సామాజిక సేవా కార్యక్రమాలు చేయడంలో లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ప్రాణహిత ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుందని లయన్స్ క్లబ్ ఆప్ హైదరాబాద్ వైస్ డిస్ట్రిక్ గవర్నర్ లయన్ జి.శ్రీనివాస్ పేర్కొన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని వేముకుంట ప్రభుత్వ ప్రాథమిక తెలుగు, ఉర్థూ మీడియం పాఠశాలల్లో విద్యార్థులకు లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ప్రాణహిత పుస్తకాలు, పెన్నులను ఉచితంగా అందజేశారు. అదేవిధంగా పాఠశాల ఉపాధ్యాయులకు నెలసరి వేతనాలను ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పెన్నులు, పాఠ్యపుస్తకాలను అందజేయడంతో పాటు ప్రతి నెలా ఉపాధ్యాయులకు వేతనాలను అందజేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్ ఎండీ అన్వర్ షరీప్, లయన్ ప్రభాకర్ రెడ్డి, క్రిష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.