తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వ‌హించాలి: యోగానంద్

శేరిలింగంప‌ల్లి (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తెలంగాణ విమోచ‌న దినోత్స‌వాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం అధికారికంగా నిర్వ‌హించాల‌ని శేరిలింగంప‌ల్లి బీజేపీ ఇన్‌చార్జి గ‌జ్జ‌ల యోగానంద్ డిమాండ్ చేశారు. గురువారం లింగంప‌ల్లి రాజీవ్ గృహ‌క‌ల్ప‌లో డివిజ‌న్ బీజేపీ అధ్య‌క్షుడు రాజు శెట్టి ఆధ్వ‌ర్యంలో తెలంగాణ విమోచ‌న దినోత్స‌వాన్ని నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి యోగానంద్ ముఖ్య అతిథిగా హాజ‌రై జాతీయ జెండాను ఎగుర వేశారు.

జాతీయ ప‌తాకాన్ని ఆవిష్క‌రించిన గ‌జ్జ‌ల యోగానంద్

ఈ సంద‌ర్భంగా యోగానంద్ మాట్లాడుతూ.. నిజాం నిరంకుశ పాలన అంతం అయిన రోజు తెలంగాణ విమోచ‌న దినోత్స‌వం అని, ఇది ఒక పండుగ రోజ‌ని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వ‌హించ‌క‌పోవ‌డం దారుణ‌మ‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఐఎం మెప్పు కోసమే సీఎం కేసీఆర్ వెనుకంజ వేయడం శోచనీయం అని అన్నారు.

తెలంగాణ రాక ముందు విమోచ‌న దినోత్స‌వాన్ని అధికారికంగా నిర్వ‌హిస్తామ‌న్న కేసీఆర్ తెలంగాణ వ‌చ్చి తెరాస ప్ర‌భుత్వం అధికారంలోకి వచ్చాక మాట మార్చార‌ని అన్నారు. ప్ర‌భుత్వం క‌ళ్లు తెరిచి ఇప్ప‌టికైనా తెలంగాణ విమోచ‌న దినోత్స‌వాన్ని నిర్వ‌హించాల‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కాంచన కృష్ణ, డివిజన్ ఉపాధ్యక్షులు బాలరాజు, బాబు, నర్సింహా, సత్య కురుమ, శ్రీకాంత్, అరుణ, అనిత, మహేష్, శ్రీనివాస్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here