నమస్తే శేరిలింగంపల్లి: విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో లక్ష యువగళ గీతార్చన కార్యక్రమం ఈ నెల 14 వ తేదీన భాగ్యనగరంలోనిర్వహించనున్నట్లు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్రప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పాపిరెడ్డి కాలనీ హనుమాన్ దేవాలయంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో లక్ష యువ గళ గీతార్చన 40 శ్లోకాల పుస్తకాన్ని, ఫోస్టర్ ను జ్ఞానేంద్ర ప్రసాద్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల14వ తేదీన భాగ్యనగరంలో నిర్వహించనున్న లక్ష యువగళ గీతార్చన కార్యక్రమంలో హిందూ బంధువులందరూ అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వి హెచ్ పి నాయకులు కృష్ణ, రాఘవేంద్ర, బిజెపి డివిజన్ అధ్యక్షుడు రాజు శెట్టి, ఎల్లేశ్, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.