నమస్తే శేరిలింగంపల్లి: బాలబాలికలకు కుస్తీ ఆటలో శిక్షణ ఇస్తూ కుస్తీ పైల్వాన్ లుగా తీర్చిదిద్దుతూ క్యాతమ్ శ్రీకాంత్ యాదవ్ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు భేరీ రామచందర్ యాదవ్ అన్నారు. మంగళవారం కుస్తీ క్రీడా శిక్షకుడు క్యాతమ్ శ్రీకాంత్ యాదవ్ ను భేరి రాంచందర్ యాదవ్ సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నార్సింగ్ గ్రామానికి చెందిన క్యాతమ్ శ్రీకాంత్ యాదవ్ గొర్రెల కాపరి గా ఉంటూ తన తండ్రి క్యాతమ్ అడివయ్య, తాత యాదయ్య కుస్తీ పోటీలో చూపిన ప్రతిభను ఆదర్శంగా చేసుకుని కుస్తీ పోటీలను మక్కువ చేసుకున్నాడని అన్నారు. కుస్తీ పోటీల్లో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర, దేశ స్థాయి వరకు తన ప్రతిభను కనబరిచేందుకు 20 ఏళ్లుగా కృషి చేస్తున్నారని అన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో పథకాలు అందుకుని పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పారు. కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియం, యూసఫ్ గూడ లో స్పోర్ట్స్ అథ్లెటిక్స్ ఆఫ్ తెలంగాణ శిక్షకుడిగా పనిచేస్తూ 800 నుండి 1000 మందికి కుస్తీ పోటీలో శిక్షణ ఇస్తూ 300 మందికి పతకాలు వచ్చేలా తీర్చిదిద్దడం గొప్ప విషయమని అన్నారు. ముఖ్యంగా ఆడపిల్లల్లో స్పూర్తిని నింపుతూ 40 మందిని వివిధ విభాగాలలో రాష్ట్రానికి మంచి పేరు తెచ్చేలా తీర్చిదిద్దుతున్నారని అన్నారు. యువతకి క్రీడారంగంలో స్ఫూర్తినిస్తూ, శిక్షణనిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న క్యాతమ్ శ్రీకాంత్ యాదవ్ ను భేరి రాంచందర్ యాదవ్ అభినందించారు.