నమస్తే శేరిలింగంపల్లి: టీఅర్ పీఎస్ ఆర్ఎంపీ, పీఎంపీ వైద్య సంఘాల రాష్ట్ర కమిటీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని గచ్చిబౌలిలోని ఎస్ ఎన్ గార్డెన్ ఫంక్షన్ హల్ లో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ఆర్ డీ సీ చైర్మన్ డా.వి ప్రకాష్, ఆర్ఎంపీ, పీఎంపీ సంఘం వ్యవస్థాపక, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వెంకట్ రెడ్డి హాజరై నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. డాక్టర్.వి ప్రకాష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్ఎంపీ పీఎంపీ పట్టణ, గ్రామీణ వైద్యులకు న్యాయం చేస్తామని గుర్తింపు, చట్ట భద్రతపై 2014 మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగిందని అన్నారు. పొందుపరిచిన వ్యక్తులలో తాను కూడా ప్రధాన పాత్ర లో ఒకడినని గుర్తు చేశారు. ఆర్ఎంపీ పీఎంపీ వైద్యుల కష్టాలు టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే తీరనున్నాయని వెంకట్ రెడ్డి తెలిపారు. బంగారు తెలంగాణతోపాటు ఆరోగ్య తెలంగాణ కావాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే సాధ్యనవుతుందని తెలిపారు. ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యుల ఇబ్బందులపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే రాష్ట్రంలోని 45 వేల మంది ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు డా.జాఫర్, పి శ్రీనివాస్ శివరాజ్, నందిని, జయ, రాధిక, డా. సునీత, డా. గీత, డా. వహీద్, డా.రామరాజు, డా. బాలకృష్ణ, డా. ప్రసాద్, డా. చిన్ని, డా. ఖాన్ సాబ్, డా.మౌలాలి, డా. జమాలుద్దీన్ తో పాటు సుమారు 500 మంది వైద్యులు పాల్గొన్నారు.