నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బతుకమ్మ పండగ ప్రతిబింబమని, యావత్తు ప్రపంచంలోనే ఎంతో విశిష్టతగా బతుకమ్మ పండుగ నిలిచిదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. ఆడపడుచులకు బతుకమ్మ పండగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన బతుకమ్మ చీరలను కొండాపూర్ డివిజన్ పరిధిలోని కొత్తగూడ కమ్యూనిటీ హాల్ లో స్థానిక కార్పొరేటర్ హమీద్ పటేల్, డీసీ సుదాంష్ తో కలిసి ప్రభుత్వ విప్ గాంధీ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, పీఓ పద్మ, శానిటేషన్ సూపర్ వైజర్ జలంధర్ రెడ్డి, కొండాపూర్ డివిజన్ ప్రెసిడెంట్ అబ్బుల కృష్ణ గౌడ్, మాదాపూర్ డివిజన్ ప్రెసిడెంట్ ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, మాజీ కార్పొరేటర్ రవీందర్ ముదిరాజ్, సీనియర్ నాయకులు ఊట్ల కృష్ణ, అన్నం శశిధర్ రెడ్డి, చాంద్ పాషా, జంగం గౌడ్, పేరుక రమేష్ పటేల్, బలరాం యాదవ్, శ్రీనివాస్ గౌడ్, నరసింహ సాగర్, కె నిర్మల, గౌరీ, రూప రెడ్డి, శ్రీరామ్ నగర్ కాలనీ ప్రెసిడెంట్ వెంకట్ రెడ్డి, తిరుపతి యాదవ్, బసవ రాజు, రవి శంకర్ నాయక్, రజనీకాంత్, మహ్మద్ అలీ, షబ్బీర్, ఎల్లయ్య, గిరి గౌడ్, మంగమ్మ, అడ్వకేట్ కృష్ణవేణి, పుణ్యవతి, షేక్ రఫియా బేగం, లక్ష్మి, కుమార్, లక్ష్మి నారాయణ, వంగ తిరుపతి రెడ్డి, గణపతి, డా రమేష్, సాగర్, సాయి కుమార్, రామకృష్ణ, దీపక్, ఖాసీం, మహ్మద్, వివి రావు, శ్రీనివాస్ గౌడ్, యాదగిరి, మంగలి కృష్ణ, జీహెచ్ఎంసి సిబ్బంది ఎస్సార్పీ రాజయ్య, ఎస్ ఎఫ్ ఏ వేణు, నందు తదితరులు పాల్గొన్నారు.