విద్యార్థి నిరుద్యోగ సైరన్ లో శేరిలింగంపల్లి యూత్ కాంగ్రెస్ నాయకులు

నమస్తే శేరిలింగంపల్లి: విద్యార్థి నిరుద్యోగ సైరన్ కు పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు శనివారం ఎల్ బి నగర్ లోని శ్రీకాంత్ చారి చౌక్ లో ఐవైసీ జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్, టీవైసీ రాష్ట్ర అధ్యక్షుడు శివ సేన రెడ్డి, ఎన్ ఎస్ యూ ఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూర్ పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులతో కలిసి ధర్నా చేపట్టారు. విద్యార్థి నిరుద్యోగ సైరన్ లో శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి యూత్ కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యూత్ కాంగ్రెస్ నాయకులు రాజన్, దుర్గం శ్రీహరి గౌడ్, దుర్గేష్ తదితరులు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరుద్యోగుల సంఖ్య రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతుందని, నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. యువజన కాంగ్రెస్ నాయకులు అడ్డుపడడంతో పోలీసులు లాఠీ చార్జీ చేయడంతో పలువురికి‌ గాయాలయ్యాయి.

నిరుద్యోగ సైరన్ లో శేరిలింగంపల్లి యూత్ కాంగ్రెస్ నాయకులు

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here