నమస్తే శేరిలింగంపల్లి: దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ సంక్షేమ ప్రభుత్వంగా పేరుగాంచిందని, కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ లాంటి పథకాలతో పేద కుటుంబాల్లో వెలుగులు నిండుతున్నాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని అర్హులైన 80 మందికి కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకం ద్వారా మంజూరైన చెక్కులను ప్రభుత్వ విప్ గాంధీ అందజేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు ఏ లోటూ రాకుండా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ పేదలకు ఎంతో ఆసరాగా నిలుస్తుందన్నారు. అందులో భాగంగానే ఈ రోజు రూ. 80 లక్షల ఆర్థిక సహాయాన్ని కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల ద్వారా అందజేయడం జరిగిందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రోజాదేవి రంగరావు, దొడ్ల వెంకటేష్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్ తో పాటు టీఆర్ఎస్ వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షుడు సంజీవ రెడ్డి, ఆల్విన్ కాలనీ డివిజన్ అధ్యక్షుడు సమ్మారెడ్డి, కూకట్ పల్లి డివిజన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, నాయకులు కాశీనాథ్ యాదవ్, మోజేష్, మధు, చంద్రమోహన్ సాగర్, ఆంజనేయులు, గుడ్ల శ్రీనివాస్, శ్రీహరి, మున్నా, రాములు, శ్రావణి రెడ్డి, పద్మ తదితరులు పాల్గొన్నారు.