నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని జేవీ కాలనీలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ట్రాఫిక్ ఏసీపీ హన్మంతరావు, ట్రాఫిక్ అధికారులతో కలిసి పర్యటించారు. జేవీ కాలనీ ప్రజలు గచ్చిబౌలి ప్రధాన రహదారి దాటేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. సంబందింత ట్రాఫిక్ అధికారులకు ఎమ్మెల్యే గాంధీ సమస్యను వివరించారు. కాలనీ వాసులు రోడ్డు దాటడానికి వీలుగా, రోడ్డు ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ట్రాఫిక్ సమస్య లేకుండా ప్రమాద రహిత సమాజం కోసం, కాలనీ వాసులు సులభంగా రోడ్డు దాటేందుకు వీలుగా పాదచారుల వంతెన నిర్మాణం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి అని ట్రాఫిక్ ఏసీపీకి సూచించారు. ఆయన వెంట ట్రాఫిక్ సీఐ నవీన్ కుమార్, సుమన్, జేవీ కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎఎస్ఎస్ఎన్ రాజు, వైస్ ప్రెసిడెంట్ మల్లికార్జున రెడ్డి, సెక్రటరీ సుబ్రమణ్యం, ట్రెజరర్ నజీముద్దీన్, వెంకటేశ్వర్ రెడ్డి, సతీష్ రెడ్డి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.