సాయికుమార్ ను పరామర్శించిన జితేందర్

నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ బిజెవైఎం ప్రధాన కార్యదర్శి సాయి కుమార్ పటేల్ ను బిజెవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి జితేందర్ పరామర్శించారు. మార్తాండనగర్ కి చెందిన సాయి కుమార్ పటేల్ శుక్రవారం రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న‌ బిజెవైఎం జిల్లా ప్రధాన‌ కార్యదర్శి జితేందర్ సాయికుమార్ ని పరామర్శించి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న దృష్ట్యా వారి కుటుంబ సభ్యులకు రూ. 5 వేల ఆర్థిక‌ సహాయం అందజేశారు. కొండాపూర్ డివిజన్ యువమోర్చ అధ్యక్షులు నవీన్ రెడ్డి , ఉపాధ్యక్షులు సతీష్ గౌడ్, హఫీజ్ పెట్ డివిజన్ బిజెవైఎం ప్రధాన కార్యదర్శి మహేష్ గౌడ్ , స్థానికులు సాయి తదితరులు‌ ఉన్నారు.

రోడ్డు ప్రమాదంలో గాయపడిన సాయికుమార్ ను పరామర్శించిన బిజెవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి జితేందర్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here