- తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవంలో జాతీయ జెండాను ఎగురవేసి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం జిహెచ్ఎంసి జోనల్ కార్యాలయంలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పలు కాలనీల్లో ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పథకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను సీ.ఎం కేసీఆర్ నేతృత్వంలో అధికారికంగా నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని కార్పొరేటర్ అన్నారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో స్వరాష్టంగా అవతరించిన అనంతరం తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి, సంక్షేమంతో ముందంజలో ఉంటూ యావత్ భారతదేశానికి దిక్సూచిగా నిలుస్తున్నదని అన్నారు. ఈ సందర్బంగా అమరవీరులను స్మరించుకుంటూ వారికీ ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శంకరయ్య, డిప్యూటీ కమిషనర్ వెంకన్నా, ఈ ఈ శ్రీనివాస్, మాన్వి, జలందర్ రెడ్డి, తదితర శాఖల అధికారులు, డివిజన్ అధ్యక్షులు వీరేశం గౌడ్, మోహన్ గౌడ్, శ్రీనివాస్ రాజు ముదిరాజ్, జగన్మోహన్ రెడ్డి, వార్డ్ మెంబెర్స్ శ్రీకళ, కవిత, పర్వీన్ బేగం, గోవింద్ చారీ, రవి యాదవ్, బస్వారాజ్ లింగయ్యత్, కోదండరావు, గోపాల్ యాదవ్, రవీందర్,రాజ్ కుమార్, సుధాకర్ రెడ్డి, నర్సింలు, వీరేశం గౌడ్, పోచయ్య, కన్నా, కనకలక్ష్మి, విజయలక్ష్మి, కుమారి, సుధారాణి, కళ్యాణి, దీప, దివ్య, గౌసియా బేగం, లక్ష్మి,తదితర కాలనీ అసోసియేషన్, మహిళలు, బూత్ కమిటీ సభ్యులు, ఏరియా కమిటీ సభులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.