నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ పరిధి లోని గౌలిదొడ్డిలో కార్పొరేటర్ కార్యాలయం వద్ద శనివారం గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. అనంతరం సర్దార్ వల్లభాయి పటేల్, జాతిపిత మహాత్మాగాంధీ, భరతమాత చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. రాష్ట్ర ప్రజలకు గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాం, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడి అమరులైన యోధులను స్మరించుకునేందుకే నేడు మనం వేడుకలు నిర్వహించుకుంటున్నామన్నారు. నిజాం కాలంలో రజాకార్ల అకృత్యాలు, వారిపై ప్రజలు చేసిన పోరాటాలను యావత్ దేశానికి తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ నగర్, తాజ్ నగర్, సోఫా కాలనీ సొసైటీ అధ్యక్షులు బి విటల్, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ తిరుపతి, గచ్చిబౌలి డివిజన్ కిసాన్ మోర్చా అధ్యక్షులు కిషన్ గౌలి, సీనియర్ నాయకులు వసంత్ కుమార్ యాదవ్, మూలగిరి శ్రీనివాస్, నర్సింగ్ నాయక్, ప్రభాకర్, శేఖర్, రంగస్వామి ముదిరాజ్, రాజు, శ్రీను, యాదయ్య , నర్సింగ్ రావు, చైతన్య పాల్గొన్నారు.