శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 19 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రజలలో క్యాన్సర్ పై అవగాహన కల్పించడంలో భాగంగా గత దశాబ్ద కాలంగా రన్ ఫర్ గ్రేస్ కార్యక్రమాన్ని గ్రేస్ సంస్థ నిర్వహిస్తోంది. ఈ ఏడాది శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలి స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సామాజిక, రాజకీయ, సినీ ప్రముఖులు హాజరు అవుతున్నారని శేరిలింగంపల్లి డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్, టీపీసీసీ కార్యదర్శి సామ్యుల్ కార్తీక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన, సంస్థ ప్రతినిధులు కలిసి తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను క్యాన్సర్ అవగాహన కార్యక్రమానికి ఆహ్వానించారు.