సైబరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లో గురువారం ట్రైనీ స్టేషన్ రైటర్ లతో సైబరాబాద్ పోలీస్ కమీషనర్ వీసీ సజ్జనార్ ముచ్చటించారు. ఈ సందర్భంగా సైబరాబాద్ సీపీ మాట్లాడుతూ వివిధ ట్రైనింగ్ సెంటర్ల నుంచి ట్రెయిన్ అయి సైబరాబాద్ కమీషనరేట్ కు 1068 కానిస్టేబుళ్లు అలాట్ అయ్యారని, వీరిలో 306 మంది కానిస్టేబుళ్లు స్టేషన్ రైటర్ లు గా పని చేసేందుకు విల్లింగ్ ఉండగా వివిధ పరీక్షలు నిర్వహించి 225 మంది ని స్టేషన్ రైటర్లు గా ఎంపిక చేశామన్నారు.
ఇన్వెస్టిగేషన్ లో నేరం జరిగిన తర్వాత ఛార్జ్ షీట్ వేయడం, ట్రయల్, శిక్షలు పడే వరకు కన్విక్షన్ తీసుకురావడంలో ఎన్ స్టేషన్ రైటర్/ ఇన్వెస్టిగేషన్ అసిస్టంట్ ల పాత్ర కీలకమన్నారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఐపీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, టెస్ట్ ఐడెంటిఫికేషన్ పరేడ్, జువైనల్ జస్టిస్ సిస్టమ్, ఎఫ్ ఎస్ ఎల్, స్టేట్ మెంట్ రికార్డ్స్, మెడికల్ సర్టిఫికేట్ అన్ని రకాల ఇతర చట్టాలపై బాగా అవగాహన పెంచుకోవాలన్నారు. ఈ స్టేషన్ రైటర్ లకు ఒక నెల పాటు ట్రైనింగ్ ఇవ్వనున్నారు.
సైబరాబాద్‌లోని సిటిసిలో ఒక నెల శిక్షణా కార్యక్రమం నిర్వహించబడుతుంది. శిక్షణ పొందినవారికి సీన్ ఆఫ్ అఫెన్స్ కి వెళ్ళడానికి, సాక్ష్యాల సేకరణ సమయంలో పరిశీలన, వివిధ రకాలైన నేరాలపై దర్యాప్తు కోసం, సీడీ పైల్స్ రాయడం, కోర్టు తీర్పులను అధ్యయనం చేయడం, కోర్టు సందర్శనల వంటి ఆచరణాత్మక సెషన్లను కల్పిస్తారు. ప్రాసిక్యూషన్ ఆచరణాత్మక అంశాల గురించి తెలుసుకోవడానికి వీలుంటుందన్నారు. స్టేషన్ రైటర్ లు 5Ws, 1H (What, Why, Where, Who, When, How (ఎందుకు?, ఏమిటి?, ఎప్పుడు?, ఎక్కడ ?,ఎవరు?, ఎలా?)పై అవగాహన కలిగి ఉండాలన్నారు. FIR ని లాగికల్ కన్ క్లూజన్ తీసుకురావాలన్నారు.
ఈ కార్యక్రమంలో సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి ఎస్ ఎమ్ విజయ్ కుమార్, మాదాపూర్ డిసిపి వెంకటేశ్వర్లు, రిటైర్డ్ ఎస్పీ మల్లా రెడ్డి, విమన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డిసిపి అనసూయ, బాలానగర్ డిసిపి పద్మజ, ఏడిసిపి క్రైమ్స్-I కవిత, ఏడీసీపీ (అడ్మిన్) లావణ్య ఎన్ జెపీ, ఏసీపీలు, లా అండ్ ఆర్డర్ ఇన్ స్పెక్టర్లు పాల్గొన్నారు.