శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 20 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రతి కార్యకర్త సభ్యత్వ నమోదు కార్యక్రమం ఒక యజ్ఞంలా చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంఛార్జి రవికుమార్ యాదవ్ అన్నారు. శుక్రవారం కొండాపూర్ డివిజన్ , అంజయ్య నగర్, సిద్ధిక్ నగర్ బూత్ స్థాయిలో ప్రతి ఇంటికి వెళుతూ నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఒక మహా యజ్ఞంగా నియోజకవర్గంలో చేపట్టాలని అన్నారు. ప్రతి డివిజన్‌లో బూత్ స్థాయి నుండి నమోదు చేపడుతూ రెండు లక్షల మంది సభ్యులను నమోదు చేయించాలని సూచించారు.
ఈ నమోదు కార్యక్రమం ద్వారా మనకు ప్రజలతో సత్సంబంధాలు పెరుగుతాయని అన్నారు. ఈ నమోదు కార్యక్రమంలో టోల్ ఫ్రీ నెంబర్ 8800002024 కు మిస్డ్ కాల్ ఇప్పించి తద్వారా వచ్చిన లింక్ లో వారి వివరాలను పూర్తి చేయించాలని గుర్తు చేశారు. ప్రతి బూత్ నుండి 300 మందికి పైగా సభ్యులను నమోదు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సభ్యత్వ నమోదు కార్యక్రమ ఇంఛార్జి మహిపాల్ రెడ్డి, మాదాపూర్ కంటెస్టెడ్ కార్పొరేటర్ రాధాకృష్ణ యాదవ్, డివిజన్ అధ్యక్షుడు ఆంజనేయులు సాగర్, అరవింద్, రవి నాయక్, ప్రసాద్ రెడ్డి, సరోజ, ఆత్మారాం, భాస్కర్ రెడ్డి, భన్సిలాల్, ప్రసాద్, అజయ్, చందు, మల్లేష్, మనీష్ పాల్గొన్నారు.