PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీని క‌లిసిన ఇంద్రారెడ్డి ఆల్విన్ కాలనీ స‌భ్యులు

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 16 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని ఇంద్రారెడ్డి ఆల్విన్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కు నూతనంగా ఎన్నుకోబడిన కాలనీ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీని వివేకానంద నగర్ లోని ఆయ‌న నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అభినందించారు. ఈ సందర్భంగా PAC ఛైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ ఇంద్రారెడ్డి ఆల్విన్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కు నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గ సభ్యులు కాలనీ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, కాలనీ లో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని, కాలనీ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయి అని అన్నారు. ఏ చిన్న సమస్య అయినా తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంద్రారెడ్డి ఆల్విన్ కాలనీ అధ్యక్షుడు విఘ్నేశ్వర రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ పెద్దిరెడ్డి, జనరల్ సెక్రటరీ శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ కిషన్, ట్రెజరర్ సాంబశివ రెడ్డి, లీగల్ సెక్రెటరీ వేణు గోపాల్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రెటరీ నర్సింలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here