నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ నేతాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు భేరీ రామచందర్ యాదవ్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశ ప్రజలందరూ ఐక్యమత్యంతో దేశ అభివృద్ధి సాధించాలని అన్నారు. భేరీ రామచందర్ యాదవ్ మాట్లాడుతూ భారత దేశ స్వతంత్రం కోసం ఎందరో మహానుభావులు ప్రాణ త్యాగాలు చేశారని వారి త్యాగ ఫలమే మనమందరం స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నామని అన్నారు. బంజారా సంఘం అధ్యక్షుడు హనుమంతు నాయక్, ఉపాధ్యక్షులు రాయుడు, ఎండి కమర్ పాషా, మల్లేష్ ముదిరాజ్, ఏం సంతోష్, మందుల మహేష్, మందుల సైదులు, నాగేష్ నాయక్, బాల్ రాజ్ నాయక్, గణేష్ నాయక్, రాజు నాయక్, లక్ష్మారెడ్డి , ప్రభాకర్ చారి, రాము, వినయ్, నాగరాజు, అబ్దుల్, బాల్ రాజ్ సాగర్, లవన్ చారి, భేరీ చంద్రశేఖర యాదవ్, అశోక్, సురేష్ , గోపి, శ్రీను తదితరులు ఉన్నారు.
