హైద‌రాబాద్ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం: మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్

కొండాపూర్‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కొండాపూర్ డివిజ‌న్ ప‌రిధిలో బిజెపి అభ్యర్థి మారబోయిన రఘునాథ్ యాదవ్ మద్దతుగా మాజీ ఎమ్మెల్యే ఎం.బిక్షపతి యాదవ్, నాయకుడు ఎం.రవి కుమార్ యాదవ్ లు రోడ్ షో నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రేట‌ర్ అభివృద్ధి కేవ‌లం బీజేపీతోనే సాధ్య‌మన్నారు. ప్ర‌ధాని మోదీ నాయ‌క‌త్వంలో దేశం అభివృద్ధి చెందుతుంద‌ని, బీజేపీ ఆధ్వ‌ర్యంలో హైద‌రాబాద్‌ను అభివృద్ధి చేస్తామ‌న్నారు. డిసెంబ‌ర్ 1న జ‌రిగే పోలింగ్‌లో బీజేపీ అభ్య‌ర్థుల‌కు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాల‌న్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకుడు బాల్ద అశోక్, ఎం.రాజు యాదవ్ పాల్గొన్నారు.

ర్యాలీ నిర్వ‌హిస్తున్న మాజీ ఎమ్మెల్యే ఎం.బిక్షపతి యాదవ్, ఎం.రవి కుమార్ యాదవ్
ర్యాలీలో భాగంగా మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే భిక్ష‌ప‌తి యాద‌వ్
భారీ సంఖ్య‌లో ర్యాలీ నిర్వ‌హిస్తున్న బీజేపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here