శేరిలింగంపల్లి, జూన్ 3 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్‌పేట డివిజన్‌లో డివిజన్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తిరుపతి రెడ్డి, నిమ్మల రామకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ, బిఆర్ఎస్ సభ్యత్వ నమోదు శేరిలింగంపల్లి ఇంచార్జ్ శంబిపూర్ రాజు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గర్భిణీలకు పండ్లు పంపిణీ చేయడంతోపాటు చిన్నారులకు స్కూల్ బ్యాగులను అందజేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి సామాజిక సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పురుషోత్తం యాదవ్, కొమండ్ల శ్రీనివాస్ రెడ్డి, నవతా రెడ్డి, మమత, హరీష్ రావు, మల్లారెడ్డి, సంగారెడ్డి, రవికుమార్, నరేందర్ యాదవ్, కార్తీక్, రాయల శేఖర్ గౌడ్, వేణుగోపాల్, రోజా, గోపరాజు శ్రీనివాస్ రావు, అనిల్ రెడ్డి, శివరాజ్, అల్లావుద్దీన్, తిరుమలేష్, జనార్దన్ గౌడ్, శ్రీకాంత్, పారునంది సంతోష్ రెడ్డి, భిక్షపతి, సంతోష్ రాజు, బాబు మియా, సలీం గౌస్ తదితరులు పాల్గొన్నారు.






