నమస్తే శేరిలింగంపల్లి: నల్లగండ్ల చెరువు సమీపంలో ఉన్న స్మశాన వాటిక స్థలాన్ని సర్వే చేయించాలని కోరుతూ గుల్ మొహర్ కాలనీ అధ్యక్షుడు షేక్ ఖాసీమ్ తో కలిసి నేతాజీ నగర్ వెల్ఫేర్అసోసియేషన్ అధ్యక్షుడు భేరీ రాంచందర్ యాదవ్ మంగళవారం రంగారెడ్డి జిల్లా రికార్డ్ సర్వే అండ్ ల్యాండ్ డైరెక్టర్ కె. శ్రీనివాసులు కు వినతి పత్రం అందజేశారు. స్మశాన వాటికను అభివృద్ధి చేయాలని ఇది వరకు శేరిలింగంపల్లి సర్కిల్ ఉపకమిషనర్ వెంకన్న దృష్టికి తీసుకెళ్లినట్లు భేరి రాంచందర్ యాదవ్ తెలిపారు. నేతాజీ నగర్ కాలనీ, నల్లగండ్ల గ్రామము, శ్రీ కృష్ణ కాలనీ, డాక్టర్స్ కాలనీ, గుల్ మొహర్ పార్క్ కాలనీ లకు చెందిన వారు స్వర్గస్తులైతే నల్లగండ్ల చెరువు సమీపంలోని స్మశాన వాటికలోనే అంత్యక్రియలు చేస్తారన్నారు. స్మశానవాటిక స్థలాన్ని సర్వే చేసి అభివృద్ధికి సహకరించాలని కోరారు.వినతి పత్రం అందజేసిన వారిలో ప్రధాన కార్యదర్శి నిరంజన్ రెడ్డి, ఉపాధ్యక్షులు లక్ష్మణరావు, శేఖర్ రావు, వెంకటేశ్వర్లు, ప్రభాకర్ యాదవ్ బాల్ రాజ్ సాగర్, శివ తదితరులు ఉన్నారు.
