నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని ఆదర్శ్ నగర్ రోడ్డు నంబర్ 3లో చేపట్టిన సిసిరోడ్డు నిర్మాణ పనులను స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ రోడ్డు నిర్మాణం పనుల్లో నాణ్యత ప్రమాణాలను పాటించాలని సూచించారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సోమదాసు, యువజన నాయకులు రాగం అనిరుధ్ యాదవ్, డీఈ శ్రీనివాస్, ఏఈ సునీల్, వాటర్ బోర్డ్ ఏఈ యాదగిరి, వర్క్ ఇన్ స్పెక్టర్ మహేష్, యాదగిరి, టీపీఎస్ విశాల్, కాలనీ వాసులు లక్ష్మి నాయుడు, మోహన్ రావు, గోపినగర్ బస్తీ కమిటీ అధ్యక్షుడు గోపాల్ యాదవ్, నెహ్రూనగర్ బస్తీ కమిటీ అధ్యక్షుడు శ్రీకాంత్, నాయకులు గణపురం రవీందర్, సాయి, సూరి, ప్రభాకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.