శివాజీ మహారాజ్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుని శోభాయాత్ర

శేరిలింగంపల్లి, సెప్టెంబ‌ర్ 24 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలో శివాజీ మహారాజ్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయకుడి శోభాయాత్రలో సీపీఎం పార్టీ శేరిలింగంపల్లి జోన్ కార్యదర్శి కొంగరి కృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, శోభాయాత్రలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ నాయకులు మహేష్, సాయి, అంజి, కిరణ్, నర్సింహులు, విఘ్నేష్‌తో పాటు పలువురు పాల్గొన్నారు. వినాయకుని శోభాయాత్ర భక్తిశ్రద్ధలతో, ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here