హఫీజ్‌పేట్‌లో ఘనంగా గణేష్ లడ్డూ వేలం.. రూ.1.85 లక్షలకు తొలి లడ్డూ

శేరిలింగంపల్లి, సెప్టెంబ‌ర్ 24 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): హఫీజ్‌పేట్‌లోని టీమ్ శివాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన 9 రోజుల గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన గణేష్ మహారాజ్ లడ్డూ వేలం పాటలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వేలం పాటలో మొదటి లడ్డూను కూకట్‌పల్లి కోర్టు జనరల్ సెక్రటరీ కనకమామిడి సురేందర్ గౌడ్ రూ.1,85,116లకు కైవసం చేసుకున్నారు. అలాగే రెండో లడ్డూను బంగ్లా యాదగిరి గౌడ్ రూ.1,01,116లకు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా లడ్డూలను దక్కించుకున్న సురేందర్ గౌడ్, యాదగిరి గౌడ్‌తో పాటు వారి కుటుంబ సభ్యులకు గణపతి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, కృపాకటాక్షాలు కలగాలని టీమ్ శివాలయం సభ్యులు ఆకాంక్షించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here