శేరిలింగంపల్లి, డిసెంబర్ 9 (నమస్తే శేరిలింగంపల్లి): పాపిరెడ్డి కాలనీలోని శ్రీశ్రీశ్రీ బీరప్ప దేవాలయంలో అయ్యప్ప స్వామి మహాపడిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పవన్, శ్రీశైలం గురుస్వాముల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పూజా కార్యక్రమంలో పరిగి నియోజక వర్గం కంటెస్టెడ్ ఎమ్మెల్యే, బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి జాతీయ భవన నిర్మాణ సంక్షేమ సంఘం అధ్యక్షుడు అనంతయ్య, శేరిలింగంపల్లి యాదవ సంఘం ఉపాధ్యక్షుడు అందెల సత్యనారాయణ యాదవ్, నరేష్, కృష్ణ, అశోక్, రాజు శెట్టి కురుమ, అసెంబ్లీ నాయకులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.