నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని లింగంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం శానిటైజేషన్ పనులను స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు సెప్టెంబర్ ఒకటో తేదీ నుండి విద్యా సంస్థలు ప్రారంభం కానుండంతో ప్రభుత్వ పాఠశాలలను పరిశుభ్రం చేసి, విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా శానిటైజేషన్ ఎప్పటికప్పుడు చేయాలని అధికారులకు రాగం నాగేందర్ యాదవ్ సూచించారు. సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పాఠశాలలో పిచికారీ చేయించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి ప్రిన్సిపాల్ మహేందర్ రెడ్డి, ఉపాధ్యాయులు భాస్కర్ యాదవ్, శివకుమార్, దుర్గాభవాని, ఉదయకుమారి, ఈఈ శ్రీనివాస్, ఏఈ సునీల్, వర్క్ ఇన్‌స్పెక్టర్ లు యాదగిరి, మహేష్, గోపినగర్ బస్తి కమిటీ అధ్యక్షుడు గోపాల్ యాదవ్, సుధాకర్ రెడ్డి, దేవులపల్లి శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.