నమస్తే శేరిలింగంపల్లి: సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదట ఒక మొక్కను నాటి మంచి పనితో ప్రారంభించడం జరిగిందని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర పేర్కొన్నారు. గురువారం కమిషనరేట్ కార్యాలయం ఆవరణలో రాజ్య సభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మొక్కను నాటి సెల్ఫీ తీసుకున్నారు. మొదటి రోజు ఓ మంచి పని చేయాలనే ఉద్దేశ్యంతోనే మొక్క నాటాను అని, ప్రాణవాయువు లేకుంటే ఏ జీవికి భూమ్మీద మనుగడ లేదని స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కను నాటి సంరక్షించాలని సూచించారు.