వ‌ర‌ద బాధితుల‌కు అన్ని ర‌కాలుగా స‌హాయం: ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

గ‌చ్చిబౌలి‌‌‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): సీఎం కేసీఆర్ వ‌ర‌ద బాధితుల‌కు రూ.10వేలు అందిస్తున్నందుకు ప్ర‌జ‌లు ఆయ‌న‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నార‌ని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. గ‌చ్చిబౌలి డివిజ‌న్ ప‌రిధిలోని ఎన్టీఆర్ నగర్, నేతాజీ నగర్ ల‌లో వ‌ర‌ద బాధితుల‌కు ఆయ‌న శుక్ర‌వారం రూ.10వేల స‌హాయం పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ప్ర‌జ‌ల‌కు ఎలాంటి స‌మ‌స్య వ‌చ్చినా ప‌రిష్క‌రిస్తామ‌ని, వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు డీఈ విశాలి, ఏఈ కృష్ణవేణి, గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజ్‌, డివిజన్ తెరాస‌ అధ్యక్షుడు రాజు నాయక్, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షుడు మారబోయిన రాజు యాదవ్, హోప్ ఫౌండేషన్ ఛైర్మ‌న్ కొండా విజయ్ కుమార్‌, తెరాస నాయకులు నరేష్, సత్యనారాయణ, విఠల్ పద్మారావు, నర్సింహ రాజు, వెంకటేష్ గౌడ్, రామేశ్వరమ్మ పాల్గొన్నారు.

వ‌ర‌ద బాధితుల‌కు రూ.10వేలు అంద‌జేస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
వ‌ర‌ద బాధితుల‌కు రూ.10వేలు అంద‌జేస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here