చందాన‌గ‌ర్‌లో ఘ‌నంగా దేవీ న‌వ‌రాత్రులు

  • మహాల‌క్ష్మి అవ‌తారంలో ద‌ర్శ‌న‌మిచ్చిన అమ్మ‌వార్లు

చందాన‌గ‌ర్‌‌‌‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందాన‌గ‌ర్‌లోని విశాఖ శ్రీ శారదా పీఠ పాలిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ సముదాయంలోని శ్రీ భవానీమాత ఆలయంలో దస‌రా నవరాత్రి ఉత్సవాలు ఘ‌నంగా కొన‌సాగుతున్నాయి. ఈ సంద‌ర్భంగా 7వ రోజు అమ్మ‌వారు శ్రీ కనక దుర్గాదేవి స్వరూపిణిగా భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిచ్చారు. అమ్మ‌వారికి సుప్రభాత హారతి, శ్రీచక్రార్చన, శ్రీచక్రాభిషేకం నిర్వ‌హించారు. ప‌రిస‌ర ప్రాంతాల‌కు చెందిన భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో అమ్మ‌వారిని ద‌ర్శించుకుని తీర్థ ప్ర‌సాదాల‌ను స్వీక‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కుడు స‌త్య‌సాయి, భ‌వాని ఆల‌య అర్చ‌కుడు ర‌విశ‌ర్మ‌, పాల‌క మండ‌లి స‌భ్యులు, దేవాల‌య సేవా స‌మితి స‌భ్యులు పాల్గొన్నారు.

శ్రీ కనక దుర్గాదేవి స్వరూపిణిగా ద‌ర్శ‌న‌మిస్తున్న చందాన‌గ‌ర్ భ‌వాని అమ్మ‌వారు

హ‌నుమాన్ ఆల‌యంలో…

గంగారం హనుమాన్ దేవాలయంలో ఏడవ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మిదేవి అవతారంలో దర్శనం ఇచ్చారు. ఈ సందర్భంగా చండీ హోమం నిర్వహించారు. స్థానిక టీఆర్ఎస్ నాయకుడు కంది జ్ఞానేశ్వర్ దంపతులు హోమంలో పాల్గొన్నారు. గంగారం గ్రామస్తులు, శేరిలింగంపల్లి ప్రజలను కరోనా బారి నుండి, అకాల వర్షాల నుండి కాపాడాలని, అందరికీ ఆయురారోగ్యాల‌ను అందించాల‌ని, ఈ విజయదశమి నుండి చేపట్టిన అన్ని కార్యక్ర‌మాలు విజయవంతం కావాలని అమ్మ‌వారిని కోరుకున్నామని జ్ఞానేశ్వర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు రాజు, ప్రధాన కార్యదర్శి శ్రీశైలం యాదవ్, కమిటీ సభ్యులు శ్రవణ్ కుమార్, కుమార్, ఆర్ రవి కుమార్, నరసింహ, దినేష్, ఆలయ పండితులు, భక్తులు పాల్గొన్నారు.

గంగారం హ‌నుమాన్ ఆల‌యంలో మ‌హాల‌క్ష్మి అవ‌తారంలో ద‌ర్శ‌న‌మిస్తున్న అమ్మ‌వారు
గంగారం హనుమాన్ ఆల‌యంలో అమ్మ‌వారికి పూజ‌లు చేస్తున్న కంది జ్ఞానేశ్వర్ దంపతులు

శాంతిన‌గ‌ర్‌లో…

శాంతిన‌గ‌ర్ పోచ‌మ్మ ఆల‌యంలో శుక్ర‌వారం దేవీ న‌వ‌రాత్రి ఉత్స‌వాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా అమ్మ‌వారిని ల‌క్ష్మీదేవిగా అలంక‌రించారు. భ‌క్తులు అమ్మ‌వారిని ద‌ర్శించుకుని పూజ‌లు నిర్వ‌హించారు.

ల‌క్ష్మీదేవిగా ద‌ర్శ‌న‌మిస్తున్న శాంతిన‌గ‌ర్ పోచ‌మ్మ అమ్మ‌వారు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here