శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. భారతీయ సంస్కృతికి దీపావళి పండుగ ప్రతిబింబంగా నిలుస్తుందన్నారు. ఈ పండుగను ప్రజలందరూ జాతి, కుల, మత, వర్గ విభేదాలు లేకుండా జరుపుకుంటారన్నారు. నరకాసురుడనే రాక్షసుడి బారి నుంచి ప్రజలకు విముక్తి కలిగిందని, వారి జీవితాల్లో వెలుగులు నిండాయని, దానికి సూచకంగా ప్రజలందరూ దీపావళిని జరుపుకుంటారని తెలిపారు. ప్రజల జీవితాల్లో దీపావళి వెలుగులు నింపాలని తాను కోరుకుంటున్నానని అన్నారు. దీపావళి పండుగను ప్రజలు జాగ్రత్తలను పాటిస్తూ జరుపుకోవాలని సూచించారు.
