- రాయదుర్గంలో తెరాస అభ్యర్థి కొమిరిశెట్టి సాయిబాబా ప్రచారం
గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): తెరాస ప్రభుత్వ హయాంలోనే అన్ని విధాలుగా గచ్చిబౌలి డివిజన్ అభివృద్ధి చెందిందని డివిజన్ తెరాస అభ్యర్థి కొమిరిశెట్టి సాయిబాబా అన్నారు. శుక్రవారం ఆయన ఎమ్మెల్సీ కడియం శ్రీహరితో కలిసి రాయదుర్గంలో ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి తనను కార్పొరేటర్‌గా మరొకసారి గెలిపించాలని కోరారు. డివిజన్ పరిధిలో ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించామని గుర్తు చేశారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించామన్నారు. డివిజన్‌లో గతంలో ఎన్నడూ లేనంత అభివృద్ధి చేపట్టామని తెలిపారు. మరోసారి అవకాశం ఇస్తే గ్రేటర్‌లోనే ఆదర్శవంతమైన డివిజన్‌గా తీర్చిదిద్దుతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

