శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో శేరిలింగంపల్లి డివిజన్‌కు గాను ఇండిపెండెంట్ కార్పొరేటర్ అభ్యర్థిగా విలేకరి నల్లగంటి మల్లేశం శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆయన రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇండిపెండెంట్ అభ్యర్థిగా కార్పొరేటర్ పదవికి పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.