నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నానాక్ రాంగూడ మంత్రి సెలెస్టియా గేటెడ్ కమ్యూనిటీ లో గురువారం కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పర్యటించారు. స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వర్షపు నీటి నిల్వ లేకుండా శాశ్వత పరిష్కారం చూపుతామని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మంత్రి సెలెస్టియా కమ్యూనిటీ వాసులకు కార్పొరేటర్ హామీ ఇచ్చారు. సాధ్యమైనంత త్వరలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ఆయన వెంట జీహెచ్ఎంసీ డీఈ రమేష్, ఏఈ కృష్ణ వేణి, రంగారెడ్డి జిల్లా సంయుక్త కార్యదర్శి రవీందర్ రెడ్డి, గోపనపల్లి తండా వడ్డెర సంఘం ప్రెసిడెంట్ అలకుంట శ్రీరామ్, మంత్రి సెలెస్టియా గేటెడ్ కమ్యూనిటీ ప్రెసిడెంట్ ప్రదీప్, వైస్ ప్రెసిడెంట్ దివ్యేష్, జనరల్ సెక్రటరీ రామ్, సీనియర్ నాయకులు శివ సింగ్, సంతోష్ సింగ్, రాజా సింగ్, దేవరకొండ గోపాల్, దుర్గేష్, షేర్ ఖాన్, హాఫిజ్ ఖాన్, నర్సింగ్ రావు, గోవర్ధన్, కార్యకర్తలు సంఖ్యలో పాల్గొన్నారు.