నాలా మళ్లింపుపై కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ఆగ్రహం

నమస్తే శేరిలింగంపల్లి : గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల గ్రామంలో ఓ బహుళ నిర్మాణ సంస్థ విల్లాల నిర్మాణం చేపట్టి నాలాను మళ్లించి చేపట్టిన బహుళ నిర్మాణ సంస్థ పనులను స్థానికులతో కలిసి గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది కురిసిన వర్షాలకు నాలా చుట్టు ప్రక్కల కాలనీలు మునిగి పోయాయని, దీంతో చుట్టు పక్కల వారు కోర్టును ఆశ్రయించారన్నారు. నాలా నిర్మాణ పనుల పై కోర్టు స్టే విధించిందని, స్టే ఉత్తర్వులను బేఖాతరు చేసి నాలా పనులు చేపట్టడంతో స్థానికుల విజ్ఞప్తి మేరకు ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించామన్నారు. నాలాను దారి మళ్లించి పనులు చేపట్టడం వలన వర్షా కాలంలో చుట్టు పక్కల కాలనీలు నీట మునగడం జరుగుతుందని అన్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా పనులు జరుగుతున్నాయని ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని గంగాధర్ రెడ్డి డిమాండ్ చేశారు. కోర్టులో నాలా పనులపై స్టే ఉన్న నిర్మాణ పనులను ఎలా చేపట్టారని అధికారులపై గంగాధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ అధికారులు డిఈ నళిని, ఏఈ శేషగిరిరావు, ఏఈ కృష్ణ వేణి, వర్క్ ఇన్‌స్పెక్టర్ విశ్వనాధ్ , రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్ గారు, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ తిరుపతి, డాక్టర్స్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బుచి రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ , రాజేష్, యంగయ్య గౌడ్, ఎక్జిక్యూటివ్ మెంబెర్స్ సిందూరి, ప్రసాద్ రావు , శివ రామకృష్ణ , నాగభూషణం, సీనియర్ నాయకులు వసంత్ కుమార్ యాదవ్, వెంకట్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, శ్రీ రాములు, శ్రీనివాస్ ,హరీష్ శంకర్ యాదవ్ , కిషన్ గౌలి, మన్నే రమేష్, రాయుడు, వినయ్, బాలరాజు, వేణు, ప్రసాద్ , జై శ్రీనివాస్, పీ రాజు శ్రీను, వెంకటేష్, సునీల్ , ఆనంద్, గొరక్, అంబజి, నర్సింగ్ రావు, నాయుడు, నరేష్, కార్యకర్తలు పాల్గొన్నారు.

నాలా మళ్లింపు పనులను పరిశీలిస్తున్న‌ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here