నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలకు నూతన ఆహార భద్రత కార్డులను చందానగర్ డివిజన్ పరిధిలోని జీహెచ్ఎంసీ అంబేద్కర్ కళ్యాణ మండపంలో స్థానిక కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డితో కలిసి బుధవారం ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పంపిణీ చేశారు. ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ అర్హులైన ప్రతి పేదవారికి రేషన్ కార్డ్ లు అందిస్తామని, పేదల ఆకలి తీర్చడానికి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని అన్నారు. నిజమైన అర్హులకు రేషన్ కార్డ్ లు తప్పకుండా మంజూరు చేస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు రవీందర్ రావు, లక్ష్మీనారాయణ గౌడ్, చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, నాయకులు లక్ష్మారెడ్డి, గోవర్ధన్, ప్రీతమ్, ఓ.వెంకటేష్, పారునంది శ్రీకాంత్ రెడ్డి, పులిపాటి నాగరాజు, రాజశేఖర్ రెడ్డి, ప్రవీణ్, దాస్, తదితరులు పాల్గొన్నారు.