చందాన‌గ‌ర్‌ ఇన్ఫినిటీ మాల్ లో గేమ్ ఆన్ ప్లే జోన్ ప్రారంభం

  • హాజరైన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ఎమ్మెల్యే ఆరెక‌పూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 16 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చిన్నారుల ఆటవిడుపు కోసం విభిన్న రకాల, వినోద భరితాన్ని పంచే ఆటలతో ఏర్పాటు చేసిన గేమ్ ఆన్ ప్లే ఏరియాను ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ముఖ్యఅతిథిగా హాజరై, స్థానిక ఎమ్మెల్యే ఆరెక‌పూడి గాంధీ, నిర్మాత రాక్ లైన్ వెంకటేష్, కార్పొరేటర్ అప్పలపాటి శ్రీకాంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవి సెలవుల్లో పిల్లలకు ప్రత్యేక వినోదాన్ని అందించేందుకు గేమ్ ఆన్ ప్లే జోన్ ను చందానగర్ లో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. తక్కువ ఛార్జీలతో అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండేలా ప్లే జోన్ ను కొనసాగించాల్సిందిగా నిర్వాహకులను కోరారు.

అనంతరం నిర్వాహకులు అభిలాష్, శ్రావ్యలు మాట్లాడుతూ చిన్న, పెద్ద వయస్సుతో సంబంధం లేకుండా అందరూ సందడిగా గేమ్స్ ఆడుకునేందుకు వీలుంది. వర్చువల్ గేమ్స్, బౌలింగ్, సాఫ్ట్ ప్లే, క్రికెట్, హ్యూమన్ క్లా, కార్నివాల్ గేమ్స్, డాషింగ్ కార్స్ గేమ్స్ అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు పుట్టినరోజు వేడుకలు, రుచికరమైన భోజనం అందుబాటులో ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో గేమ్ ఆన్ నిర్వాహకులు, డైరెక్టర్ బాబీ, నటులు సామ్రాట్, రోల్ రైడా, గాయత్రి భార్గవి, జనార్దన్ మహర్షి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here