ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా గురుపూజోత్సవం

నమస్తే శేరిలింగంపల్లి: లింగంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా గురుపూజోత్సవం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా కేంద్రీయ విశ్వవిద్యాలయం ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్, ఎడ్యుకేషన్ టెక్నాలజీ శాఖ అధ్యక్షుడు ఆచార్య జె.వి. మధుసూదన్ జోషి హాజరయ్యారు. భారతరత్న సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం శేరిలింగంపల్లి మండల పరిధిలో గల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన విద్యాలయాల్లో పనిచేసే అధ్యాపకులను ఘనంగా శాలువ, జ్ఞాపిక, పగిడిలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యంత గౌరవ ప్రధామైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి అని అన్నారు. భవిష్యత్తు సమాజ నిర్ధేశకులు అధ్యాపకులే అని అన్నారు. రాధాకృష్ణన్ గొప్ప తత్వశాస్త్రవేత మాత్రమే కాదనీ, ప్రపంచం గుర్తించిన మేధావి అని తెలిపారు. ఈ సమాజానికి చేసిన సేవలకు గుర్తింపు గా ఆయన జన్మదినాన్ని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం గా నిర్వహించుకుంటూ, ఉపాధ్యాయులను సన్మానించుకోవడం జరుగుతుందని అన్నారు.

ఉపాధ్యాయులను సన్మానిస్తున్న రామస్వామి యాదవ్

నేటి యువ అధ్యాపకులు సర్వేపల్లి గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని విద్యావిధానంలో వస్తున్న మార్పులను గుర్తించాలన్నారు. అంతేకాకుండా, కాలనుకులంగా సిలబస్ లో వస్తున్న మార్పులను , సమాజంలో జరుగుతున్న వాస్తవత పరిస్థితులను ఆకళింపు చేసుకోవాలన్నారు. అధ్యాపక వృత్తికి ఉన్నటువంటి విశిష్ట స్థానాన్ని దృష్టిలో ఉంచుకుని భావిభారత పౌరులైన విద్యార్థిని , విద్యార్థులకు విలువలతో కూడిన గుణాత్మక విద్య ను అందించి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దవలసిన సామాజిక బాధ్యత అధ్యాపకులదే నని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శంకర్ , వివిధ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు వసుంధర , బసవలింగం , అశోక్, అధ్యాపకులు, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఫణికుమార్, రామ్మోహన రావు, విష్ణుప్రసాద్, పాలం శ్రీను, నల్లగొర్ల శ్రీనివాసరావు, రామిరెడ్డి , జనార్దన్, వాణి సాంబశివ రావు, బాలన్న, విజయలక్ష్మి, రాణి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here